A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హ:కోర్టు శాశ్వతం అంట..ప్రభుత్వం కాదట
Share |
October 27 2020, 8:26 am

ఒకప్పుడు ఎక్కడ అక్రమం జరిగినా, అవినీతి జరిగినా అంకుశంతో పొడవాలని ప్రజలకు సుద్దలు చెప్పిన ఈనాడు పత్రిక ఇప్పుడు భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తుండడం చిత్రంగానే ఉంది.ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయ వ్యవస్తలోని కొందరిపై పిర్యాదు చేస్తూ లేఖను రాస్తే,ఆ విషయాన్ని మాత్రం ప్రచారం చేయని ఈనాడు మీడియా , జగన్ కు వ్యతిరేకంగా ఆయా ప్రముఖుల అబిప్రాయాలను విస్తారంగా ప్రచారం చేస్తోంది. తాజాగా డిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధి చెప్పారంటూ ఒక వార్తను ఇచ్చింది. న్యాయ మూర్తులపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అందులో వ్యాఖ్యానించారు.హైకోర్టు ఇచ్చే తీర్పులతో సి.ఎమ్.కు సంబందం ఏమిటని ప్రశ్నించారు.ప్రభుత్వాలు వస్తుంటాయి.పోతుంటాయి. హైకోర్టు శాశ్వతం అని ఆయన అన్నారు.
.......................
ఇంత పెద్ద జడ్జిగారు ప్రభుత్వాలు శాశ్వతం కాదంటున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అనుకుంటే ఎన్నికలు ఎందుకు ముఖ్యమంత్రుల ఎన్నిక ఎందుకు? ప్రభుత్వం అన్నది శాశ్వత వ్యవస్థ.అందులో పార్టీల ప్రభుత్వాలు మారతాయి.అలాగే హైకోర్టు శాశ్వతమే కాని,అందులో పని చేసే న్యాయమూర్తులు మారుతుంటారన్న సంగతి ని ఆయన ఎందుకు చెప్పలేదో తెలియదు. అసలు జగన్ తన లేఖలో చేసిన ఆరోపణలలోని మంచి ,చెడు విశ్లేషించకుండా ఆయన మాట్లాడడమేమిటో?ఈనాడు ప్రచారం ఏమిటో?

tags : highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info