A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో వర్షపు నీరు తగ్గుతోంది
Share |
October 27 2020, 8:24 am

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నగరంలో
నెలకొన్న పరిస్దితులపై మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కె.తారక
రామా రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్
కుమార్ తో కలసి గురువారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వివిధ శాఖల
అధికారులతో సమీక్షించారు. వర్షాలు తగ్గడం వలన జి.హెచ్.యం.సి
లోని పలు ప్రాంతాలలో వర్షపు నీరు తగ్గడం ప్రారంభమైనదని
తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
వర్షాల అనంతరం వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా
ఉండేలా వైద్యశాఖను సంసిద్ధం చేయాలని, మెడికల్ క్యాంపు లను
ఏర్పాటు చేయాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో 104
వాహనాలు, వైద్య సిబ్బంది తో కూడిన టీమ్ లను రంగంలోకి
దించాలన్నారు. వైద్య అధికారులు వేడి చేసి చల్లార్చిన నీటిని
త్రాగేలా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వైద్య శాఖ
ద్వారా Water borne diseases, Vector borne diseases నివారణపై తగు మార్గ
దర్శకాలను జారీ చేయాలన్నారు. అవసరమైన మందులను సిద్ధంగా
ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. వైద్య, మునిసిపల్, మెట్రో
వాటర్ వర్క్స్ , జి.హెచ్.యం.సి తదితర అధికారులు సమన్వయంతో
పని చేయాలన్నారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలలో స్ప్రేయింగ్ ను
విస్త్రృతంగా చేపట్టాలన్నారు. జి.హెచ్.యం.సి పరిధిలో 64
పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 45000 మందికి తరలించి వారికి
ఆహారాన్ని అందించామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని
అందించే చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. చలి తీవ్రత పేరిగే
అవకాశం వున్నదున్న వారికి దుప్పట్లు అందించేలా చూడాలని కోరారు.

శిధిలావస్థలో ఉన్న భవనాల, నిర్మాణాంలో ఉన్న భవనాలను
తనిఖీ చేసి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో
ప్రజలను తరలించేడానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే
పోలీస్ వారి సహకారంతో ప్రజలను తరలించాలన్నారు.

జి.హెచ్.యం.సి లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే
మరమ్మత్తులు నిర్వహించి రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు
తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్
శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి శ్రీ
రాహుల్ బొజ్జా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి దివ్య, ఆర్ధిక శాఖ ప్రత్యేక
కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్ , శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ తదితర అధికారులు
పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------------

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info