A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ తీర్పు చంద్రబాబు కు ఉపయోగం
Share |
October 27 2020, 8:56 am

ఇది ఆసక్తికర విషయమే. రాష్ట్రాలలో సెక్యూరిటీ కమిషన్ లు ఏర్పాటు చేయాలన్న సుప్రింకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్దంగా ఉన్న ఒక జిఓని హైకోర్టు కొట్టివేసింది.వివేషః ఏమిటంటే ఆ జిఓ విడుదలైంది చంద్రబాబు ప్రభుత్వం టైమ్ లో .ఆ కమిషన్ లో ప్రతిపక్ష నేతకు కూడా స్థానం కల్పించవలసి ఉంది . 2013లో రాష్ట్ర భద్రత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో 189 జారీ అయింది. హోంశాఖ మంత్రి ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఐదుగురు స్వతంత్ర సభ్యులు ఉంటారు. అయితే 2018లో చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ కమిషన్‌లో స్థానం కల్పించకూడదన్న ఉద్దేశంతో జీవో 189ని సవరించింది. కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం లేకుండా చేస్తూ 2018లో జీవో 42 జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాల్సిందేనని తెలిపింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 42ను సవరించి, తాజాగా జీవో జారీ చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువునిచ్చింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కి వాయిదా వేసింది.టిడిపి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత , ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్నందున ఈ తీర్పు ఆయనకే ఉపయోగపడడం విశేషం.

tags : higjcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info