A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రకాశం బ్యారేజీకి 7.5 లక్షల క్యూసెక్కుల నీరు
Share |
October 27 2020, 9:02 am

వరద బాదితులకు సహాయచర్యలు చేప్టడంతో పాటు, వారు పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వాలని ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అదికారులను ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలని ముఖ్యమంత్రి సూచిచారు.

tags : jagan floods

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info