A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి స్పీకర్ తమ్మినేని సలహా
Share |
December 2 2020, 6:49 pm

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒక సలహా ఇచ్చారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని టిడిపి కోరుకుంటున్నందున, ఆ పార్టీ వారు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ రాజీనామాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయం కన్పిస్తోందని, రాజధాని విశాఖలో కావాలని అధికార పార్టీ, వద్దని ప్రతిపక్షం.. ఎన్నికలకు వెళ్తే మంచిదేనని, ప్రజలే ఏమిటనేది నిర్ణయిస్తారని ఆయన అన్నారు. సీబీఐ విచారణపై ఏం జరుగుతుందో వేచి చూద్దామని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

tags : sitaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info