A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
Share |
September 19 2020, 1:31 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ విమర్శలు చేశారు. 2023 నాటికి కెసిఆర్ నేతృత్వంలో ఉన్న దొరల పాలన అంతం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. తల్లి తెలంగాణా పుస్తకంలో 2003లోనే కేసీఆర్‌‌ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని రాశానని గుర్తు చేశారు. నిండు అసెంబ్లీలో తాను దొరనే అని బాహాటంగా కేసీఆర్ ప్రకటించుకున్నాడని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

tags : mandakrishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info