A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 లక్షల కోట్ల సంపద వచ్చేది- చంద్రబాబు
Share |
September 19 2020, 4:36 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరోసారి పాత పాటే పాడారు. అమరావతి ఐదు కోట్ల ప్రజల కోరిక అని ఆయన అన్నారు.అమరావతిలో అన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. అమరావతిని ఉపయోగించుకుంటే మూడు లక్షల కోట్ల సంపద వచ్చేదని ఆయన చెప్పారు.రెండు లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని మరోసారి అన్నారు. 25 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు తయారు చేశామని ఆయన అన్నారు. రైతుల ఒప్పందాలు అమలు చేయాల్సి ఉందని ఆన్నారు. దానిని ఉల్లంఘించడానికి మీరెవురు అని ముఖ్యమంత్రిని అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల కరోనా పదివేల కేసులకు పెరిగిందని, వంద మంది మరణిస్తున్నారని ఆయన అన్నారు.కరోనాను వదలిపెట్టి ప్రజలను భయపెడుతున్నారని ఆయన అన్నారు.విద్వంసం చేయడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.అమరావతి కోసం మనం అంతా కలలు కన్నామని ఆయన అన్నారు.

tags : chandrababu, amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info