A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
Share |
September 19 2020, 2:23 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పదకం అమలు అయితే దక్షిణ తెలంగాణ ఎడాది అవుతుంది.ఇది తెలంగాణ కాంగ్రెస్ ,బిజెపిలు చేస్తున్న ప్రచారం. దీనిపై హుటాహుటిన టిఆర్ఎస్ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటిషన్ వేసింది.దీనికి వత్తాసు పలుకుతున్న రీతిలో ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ ఎత్తిపోతల పధకంతో గొడవలు పెడతారా అని వ్యాఖ్య.మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ప్రత్యేక అవసరం లేదని, పైగా ఈ స్కీములో ఎపి తన వాటా నీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేస్తే సరిపోతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన కటిటీ ఇచ్చిన నివేదిక సారాంశం.అయినా తెలంగాణ రాజకీయ నేతలు తమ రాజకీయ అవసరాల కోసం ఆ స్కీముపై విమర్శలు చేస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. కాని రాయలసీమకే చెందిన చంద్రబాబు కూడా వారికి వంత పాడినట్లు మాట్లాడిన తీరు ఇప్పుడు విమర్శలకు గురి అవుతుంది.ఎపిలో ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తే, ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఇటు విజయవాడ వద్ద ఉన్న కృష్ణానదికి, ఆ తర్వాత వీలైతే గుంటూరు,ప్రకాశం జిల్లాలమీదుగా రాయలసీమకు తీసుకువెళ్లవచ్చు.దానికి ఇంకా సమయం పడుతుంది.అలాగే విశాఖ వరకు కూడా పోలవరం నీటిని తరలించవచ్చు. వచ్చే ఏడాది ఆఖరుకు పోలవరం పూర్తి కావల్సి ఉంది.ఇది జరిగితే గోదావరి నీటిని విశాఖ పట్నం నుంచి గుంటూరు జిల్లాల వరకు వాడుకునే వెసులుబాటు వస్తుంది. అప్పుడు కృష్ణానదిపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ మేరకు ఆ నీటిని కరువు విస్తారంగా ఉండే రాయలసీమకు తరలించడం ద్వారా అక్కడ సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు.స్థూలంగా ఇది ఆలోచన. గతంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును విస్మరించి తాత్కాలికమైన పట్టిసీమకు ప్రాదాన్యం ఇచ్చారు. అయినా అది కొంత ఉపయోగపడిందనే అనుకుందాం.వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్వించిన కాల్వలు లేకుంటే ఆ స్కీమ్ ముందుకు వెళ్లేది కాదు.అది వేరే విషయం.పట్టిసీమతోనే రాయలసీమకు నీటిని ఇస్తామని అప్పట్లో చంద్రబాబు ,తదితర టిడిపినేతలు ప్రచారం చేసేవారు. కాని అందుకు తగ్గ ఏర్పాట్లను చంద్రబాబు ప్రభుత్వం చేయడంలో విఫలం అయింది.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ను 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి విస్తరిస్తున్నప్పుడు టిడిపి ప్రత్యేకించి కోస్తా లో వ్యతిరేకించి ప్రకాశం బ్యారేజీ వద్ద దర్నా లు నిర్వహించింది. దానికి రాయలసీమ వాసి అయిన చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చినట్లే అయింది.2014లో తాను అదికారంలోకి వచ్చాక, ఆ రెగ్యులేటర్ కెపాసిటీని మరింత పెంచడం, ఇలా 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కూడా ఎపి వాటా నీటిని తీసుకోవడానికి జగన్ ఆలోచన చేసినట్లుగా స్కీమ్ ఆలోచించి ఉంటే రాయలసీమలో మంచి పేరే వచ్చేది. అవేవి చేయకుండా ఎక్కువ భాగం మాటలకే పరిమితం అయ్యారు. కొన్ని ప్రాజెక్టులను కొనసాగించినా, వాటిలో విపరీతమైన దోపిడీ జరిగిందని, ఇష్టానుసారం రేట్లు పెంచి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన స్కీమ్ కు అంతా కలిపి నాలుగువేల కోట్ల రూపాయలు కూడా కాదు.అంతేకాక ఎపి వాటా నీటిని మాత్రమే వాడుకుంటామని ఆయన నిర్దిష్టంగా ప్రకటించారు. అయినా తెలంగాణ లోని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి బిజెపి,కాంగ్రెస్ లు పోటీపడి విమర్శలు చేస్తున్నాయి. దానికి కెసిఆర్ ను బద్ నాం చేయాలన్న లక్ష్యమే.కాని ఆ తపనలో ఆ పార్టీల నేతలు బండి సంజయ్ కాని, ఉత్తం కుమార్ రెడ్డి కాని ఒక మాట మర్చిపోతున్నారు. వారివి జాతీయ పార్టీలన్న సంగతి విస్మరించి దక్షిణ తెలంగాణలోని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. కాని వారు చెప్పేదానిలో వాస్తవం లేదు. ఎందుకంటే శ్రీశైలంలోకి నీరు రావడానికి ముందే కల్వకుర్తు, నెట్టెంపాడు,పాలమూరు-రంగారెడ్డి, బీమా,జూరాల వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ తన నీటిని వాడుకుంటుంది.కృష్ణా నదిలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే తెలంగాణలో లిప్ట్ట లు పనిచేస్తున్నాయి.అందువల్ల వాటికి సుదూరంలో ఉన్న పోతిరెడ్డి పాడు లేదా సంగమేశ్వరం వద్ద కొత్త లిప్ట్ పెడితే వారికి ఎలా నష్టం కలుగుతుందో అర్దం కాదు. వరద వచ్చే రోజులలో ఎటూ సమస్య ఉండదు. దానిని మరింత సద్వినియోగం చేసుకోవడానికే జగన్ పోతిరెడ్డి పాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోత పదకం చేపడుతున్నారు. ఒకవేళ వరదరాని సంవత్సరం ఏదైనా ఉంటే రెండువైపులా సమస్య ఉంటుంది. అప్పుడు ఉన్ననీటినే వాటాల ప్రకారం పంచుకోవలసి ఉంటుంది.దానికి సంబందించి ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, దక్షిణ తెలంగాణ ఎడాది అవుతుందని బిజెపి,కాంగ్రెస్ నేతలు ఆరోపించడం,కేంద్రానికి పిర్యాదులు చేయడం శోచనీయం. ఈ నేపధ్యంలో కెసిఆర్ ప్రభుత్వం సుప్రింకోర్టు తలుపు తట్టింది. రాయలసీమకు నీరు ఇద్దాం అని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఈ స్కీమ్ ను వ్యతిరేకించడం వ్యూహంలో భాగం కావచ్చు. రాజకీయ అవసరం కావచ్చు.అయితే శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేశారని ఎప్పటి చరిత్రో కెసిఆర్ చెబుతున్నారు.ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయన్న సంగతి ఆయన విస్మరించడం సరికాదు. తనకు కావల్సిన మేర మాత్రమే చరిత్ర చెబితే కుదరదు కదా..ఇతరులకు కూడా చరిత్ర తెలుసు అన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. అదే సమయంలో ఎపి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పిర్యాదులు చేయడం కూడా పోటాపోటీ వ్యవహారం తప్ప మరొకటి కాదు.ఈ రెండు రాస్ట్రాల పిర్యాదులను ఆసరగా చేసుకుని కేంద్ర మంత్రి షెకావత్ తన వద్దకు పంచాయతీకి రావాలని చెప్పారు.నిజానికి రెండు రాష్ట్రాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చి,ఇరు ప్రాంతాల సమ న్యాయానికి అనువైన నిర్ణయాలు తీసుకుంటే ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. దాని గురించి ఆలోచించాలి. లేకుంటే పిట్ట పోరు,పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు కేంద్రం పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది.ఇక చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోత పధకాన్ని గొడవగాపోల్చడం శోచనీయం. మరి నాగార్జున సాగర్ వద్ద చంద్రబాబు టైమ్ లో రెండు రాష్ట్రాల పోలీసులు గొడవపడిన సంగతి ఆయన మర్చిపోయారు. ఆయన టైమ్ లో ఓటు కు నోటు కేసు వరకు కెసిఆర్ తో ఉప్పు,నిప్పుగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత సైలైంట్ అయిపోయారు.దాని వల్ల రెండిందాల నష్టం వచ్చిందని ప్రజలందరికి తెలుసు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోత వద్దని చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా? పోతిరెడ్డిపాడును విస్తరించవద్దని చెప్పగలరా?కాంగ్రెస్ ,బిజెపిలు తెలంగాణలో ఒక రకంగా,ఎపిలో మరో రకంగా వ్యవహరించి రెండు రాస్ట్రాల ప్రజల మద్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం దారుణం అని చెప్పక తప్పదు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మద్య విద్వేషాలు పెంచడం వల్ల వారికి లాభం చేకూరదు.ఎందుకంటే కెసిఆర్ వారికన్నా పవర్ పుల్.సెంటిమెంట్ రగిల్చచడంలో ఆయనను మించిన మొనగాడు లేడని గతంలో రుజువు అయింది.అయినా కాంగ్రెస్,బిజెపిలు మళ్లీ చేతులు కాల్చుకోవడానికి సిద్దమైతే వారిష్టం.అలాగే ఎపిలో కారణం ఏమైనా తెలుగుదేశం రాయలసీమ ఎత్తిపోత పదకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.ఈ రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా,ముఖ్యమంత్రులు కెసిఆర్,జగన్ లు మరోసారి భోజనాల భేటీ జరిపి ప్రశాంతంగా , ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పక తప్పదు.

tags : krishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info