A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
Share |
September 19 2020, 1:19 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోలీసులను విమర్శించడాన్ని ఎపి డిజిపి గౌతం సవాంగ్ తప్పు పట్టారు. చంద్రబాబు నిరాదార ఆరోపణలు చేయడం పద్దతి కాదని ఆయన అన్నారు.గతంలో ఎన్నడూ జరగని రీతిలో కొన్ని కేసులలో పోలీసులను సైతం వేగంగా అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.2017లో 49.3 శాతం మందికి శిక్షలు పడగా.. 2020లో 64 శాతం మందికి శిక్షలు పడేలా చేయడం ప్రభుత్వ, పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం అని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు, ప్రకాశం జిల్లా చీరాల కేసుల్లో సంబంధిత ఎస్సైలపై శాఖాపరమైన చర్యలతో పాటు అట్రాసిటీ కేసుల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళితునిపై దాడి కేసులో సీఐపై చర్యలు తీసుకున్నాం. మన పోలీసులకు జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసలు లభిస్తున్నా అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. అని ఆయన అన్నారు.

tags : goutam sawang

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info