A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కొత్త ప్రయోగం
Share |
September 19 2020, 2:25 am

ఎపిలో ఇది కొత్త ప్రయోగం అనుకోవాలి. ప్రతి పరిశ్రమకు ఒక గుర్తింపు నెంబర్ ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టింది. ఆధార్ కార్డు తరహాలో ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇందుకోసం ఒక సమగ్ర సర్వే కూడా చేపడుతున్నారు.అక్టోబర్‌ 15కల్లా సర్వే పూర్తి చేసి అదే నెల 30వ తేదీలోగా పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్వే సందర్భంగా రాష్ట్రంలో పతి పరిశ్రమకు ఆధార్‌ తరహాలో 11 అంకెలతో ప్రత్యేక సంఖ్యను కేటాయించి తొమ్మిది రకాల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు. పరిశ్రమలకు ఆధార్‌ తరహాలో కేటాయించే 11 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్య ద్వారా అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ఏ జిల్లాలో ఉంది? అనే వివరాలను సులభంగా గుర్తించవచ్చు.

tags : ap, industries

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info