A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
Share |
September 19 2020, 2:25 am

మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మంత్రిమండలి సమావేశం నిర్వహించడంపై సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క ప్రశ్నలు కురిపించారు. కెటిఆర్ ఆద్వర్యంలో క్యాబినెట్ సమావేశం జరిగిందన్న వార్త తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు.. కరోనా మహమ్మారితో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడుతుంటే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఫుడ్‌ ప్రాసెసింగ్, లాజిస్టిక్‌ పాలసీ వంటి అంశాల మీద ముఖ్యమంత్రికాని వ్యక్తి సీఎం హోదాలో సమీక్ష జరపడం దేశచరిత్రలో ఇదే తొలిసారి అని విమర్శించారు. భట్టి విక్రమార్క ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సమయాలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, శాంతిభద్రతల సమస్యలు వంటివి తలెత్తినప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఆయన డిజిగ్నేట్‌ చేసిన సీనియర్‌ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రికానీ రాజ్యాంగబద్ధంగా కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనప్పుడు సీఎం తనయుడు కేటీఆర్‌ ఏ హోదాలో, ఏ నిబంధనల ప్రకారం కేబినెట్‌ భేటీ నిర్వహించారో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.

కనీసం కేబినెట్‌ భేటీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నారా.. లేక ఆయన విదేశీ పర్యటనల్లో ఉన్నారా.. అనే చర్చ జరుగుతోందని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.కేబినెట్‌ భేటీలు, ప్రభుత్వ పాలన అంటే కేసీఆర్, కేటీఆర్‌ కుటుంబ వ్యవహారం కాదని, ఇది కోట్లాదిమంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయమని, దీనిపై సీఎం కేసీఆర్, కేటీఆర్‌ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

tags : mallu bhatti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info