A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
Share |
September 19 2020, 1:21 am

కాంగ్రెస్ పార్టీలో ఇవేమీ కొత్తకాదు. తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ చార్జీగా ఉన్న ఎస్.సి. నేత అద్దంకి దయాకర్ గోడు ఇది.ఆయన రెండుసార్లు ఇక్కడ పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ ఇన్ చార్జీని మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. దాంతో ఆయన ఆయా పార్టీ ముఖ్యులను కలిసి తన గోడు చెప్పుకుంటున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత దామోదరరెడ్డిపై ఇప్పటికే ఆయన పిర్యాదు చేశారు.తాజాగా ఆయన పొన్నాల లక్ష్మయ్యను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇంచార్జులు లేరని, అది పట్టించుకోకుండా.. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన తుంగతుర్తి నియోజకవర్గంలో మరొకరిని ఇంచార్జిగా తీసుకురావడానికి ప్రయత్నించడమేంటని ఆయన వాపోయారు. ఏఐసీసీ గిరిజన విభాగం నేత బెల్లయ్యనాయక్‌నూ కలిసి ఇదే అంశం తెలియచేసి తనకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారట.

tags : addanki dayakar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info