A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
Share |
September 19 2020, 1:23 am

ఈ నెల 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 25 బస్తీ
దావాఖాన లను నూతనంగా ప్రారంభించనున్నట్లు
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్
యాదవ్ గురువారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ
25 బస్తీ దవాఖానాలలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ
కల్వకుంట్ల తారక రామారావు 4, హోం శాఖ మంత్రి శ్రీ
మహమూద్ అలీ 4, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు 2,
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ 2,
విద్యాశాఖ మంత్రి శ్రీ సబితా ఇంద్రారెడ్డి 2,
మేయర్ శ్రీ బొంతు రాంమోహన్ 3, శాసనమండలి ప్రభుత్వ
విప్ ms ప్రభాకర్, mla లు, mlc లు, డిప్యూటీ మేయర్ లు,
తాను 3 బస్తీ దవాఖానా లను స్థానిక కార్పొరేటర్ లతో
కలిసి ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వ
వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనేదే
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
లక్ష్యమని చెప్పారు. అందుకు ప్రభుత్వం ప్రభుత్వ
వైద్య రంగాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ktr ఆలోచనల లో నుండి
ఏర్పాటు అయినవే బస్తీ దవాఖానా లు అని, వీటి పనితీరు
పట్ల ఎంతో శ్రద్ధతో ఉన్నారని పేర్కొన్నారు. ghmc
పరిధిలోని హైదరాబాదు జిల్లా లో 95, రంగారెడ్డి
జిల్లా లో 32, మేడ్చల్ జిల్లాలో 40, సంగారెడ్డి
జిల్లాలో 3 చొప్పున ఇప్పటికే 170 బస్తీ దావఖాన లను
ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు
పేర్కొన్నారు. ఈ బస్తీ దావఖాన ల ద్వారా ప్రతి రోజు

సుమారు 14 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారని,
నూతనంగా 25 దవాఖానా ల ప్రారంభం తో అదనంగా మరో 2
వేల మందికి వైద్యసేవలు అందుతాయని చెప్పారు.
ప్రస్తుతం పనిచేస్తున్న బస్తీ దవాఖానా లకు అదనంగా
హైదరాబాదు జిల్లా లో 18, మేడ్చల్ జిల్లా లో 6,
రంగారెడ్డి జిల్లా లో 2 చొప్పున మరో 25 నూతన బస్తీ
దవాఖానా ల ప్రారంభం తో వాటి సంఖ్య 195 కు
చేరుతుందని వివరించారు. ghmc పరిధిలో 300 బస్తీ దావఖాన
లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ప్రజల
అవసరాలను బట్టి రానున్న రోజులలో మరిన్ని బస్తీ
దవాఖానా ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
తీసుకుంటుందని అన్నారు. వేలాది రూపాయలను ఖర్చు చేసి
వైద్య చికిత్స లు పొందలేకపోతున్న పేద ప్రజలకు ఈ
బస్తీ దవాఖానా లు ఎంతో ప్రయోజనకారిగా ఉన్నాయని,
వీటి ద్వారా అందుతున్న వైద్య సేవలతో ప్రజలు కూడా
ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఉచితంగా
వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా మందులను
కూడా అందిస్తున్న బస్తీ దవాఖానా లను సద్వినియోగం
చేసుకోవాలని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
కోరారు.

tags : talasani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info