A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
Share |
September 19 2020, 2:28 am

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసి 2020’ భారతదేశాన్ని
విద్యారంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి తోడ్పడుతుందని గవర్నర్ డా. తమిళిసై
సౌందరరాజన్ అన్నారు.
మూడున్నర దశాబ్ధాల తరువాత వచ్చిన ఈ జాతీయ విద్యా విధానం భారతదేశ
విద్యావ్యవస్థలో సమూల సంస్కరణల ద్వారా 21వ శతాబ్దపు విద్యా విధానానికి
శ్రీకారం చుడుతుందని ఆమె తెలిపారు.
“పర్ స్పెక్టివ్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసి 2020: రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ”
అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ ఈరోజు వెబినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. తమిళిసై మాట్లాడుతూ యువతరం మెజారిటీగా ఉన్న భారత్ లాంటి
దేశాల్లో నైపుణ్యాల శిక్షణ, గ్లోబల్ పోటీని తట్టుకునే విధంగా ఉద్యోగితా
నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలను, పరిశోధనలు ప్రోత్సహించే విధంగా ఈ విద్యా పాలసీని
కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటి రూపొందించిందని డా. తమిళిసై వివరించారు.
భారత్ ను ఉన్నత విద్యలో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడానికి, పూర్వ ప్రాధమిక విద్య
నుండి పి హెచ్ డి పరిశోధనల వరకు మొత్తం విద్యావ్యవస్థను సంస్కరించి, సమూలంగా
మార్చి 21వ శతాబ్ధపు అవసరాలకనుగుణంగా మార్చే దిశగా ఈ కొత్త విధానం ఉందని గవర్నర్
స్పష్టం చేశారు.
గత నాలుగు దశాబ్ధాల్లో ప్రపంచం కనివినీ ఎరుగని విధంగా మారింది. అందుకు తగిన రీతిలో
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, నానో టెక్నాలజి, కోడింగ్, డిజటల్ టెక్నాలజీ,
బయోటెక్నాలజి, ఫార్మా, వైద్యరంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే భారతీయ మూలాలను
గౌరవించే విద్యా విధానానికి రూపకల్పన జరిగిందని గవర్నర్ వివరించారు.
ప్రాథమికస్థాయిలో మాతృభాషలో బోధనతోనే పిల్లల్లో గొప్ప మానసిక వికాసం
సాధ్యమౌతుందని ఆమె అన్నారు.
భారతీయ మూలాలు, ఆధునికత కలబోసిన భవిష్యత్ తరాలను ప్రపంచస్థాయి నైపుణ్యాలతో
తీర్చిదిద్దడమే లక్ష్యమైన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి ద్వారా భారత్
విద్యారంగంలో గొప్ప స్థాయిని, పునర్వైభవాన్ని పొందడానికి విద్యారంగ నిపుణులు,
అధ్యాపకులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ విద్యావిధానంలో విద్యార్థి – కేంద్రక అభివృద్ధిని, నైపుణ్యాలను, సృజనాత్మకతను,
ఆవిష్కరణలను, ఔత్సాహికతను ప్రోత్సహించే అంశాలున్నాయని గవర్నర్ వివరించారు.
తెలంగాణకు అద్భత అవకాశాలు....
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అనేక రంగాలలో ముందంజలో ఉన్న దృష్ట్యా నేషనల్
ఎడ్యుకేషన్ పాలిసి ద్వారా భారతదేశంలో తెలంగాణ ఉన్నత విద్య హబ్ గా ఎదిగేందుకు
అపార అవకాశాలున్నాయని గవర్నర్ తెలిపారు.
ఇక్కడ ఎన్నో ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలుండటం, హైదరాబాద్ ఫార్మా హబ్ గా,
ఐటి హబ్ గా బయోటెక్నాలజీ హబ్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దృష్ట్యా ఇక
ఉన్నత విద్యా హబ్ గా, ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా ఎదగడానికి మంచి అవకాశముందని
డా. తమిళిసై వివరించారు.
ఈ వెబినార్ లో యూజీసి సభ్యులు, ఇఫ్లూ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఈ. సురేష్ కుమార్ భాషా
నైపుణ్యాలు, భాషా పద్ధతులు, శిక్షణ అన్న అంశంపై ప్రసంగించారు. అన్నా యూనివర్సిటి
మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. బాల గురుస్వామి మల్టిడిసిప్లనరి యూనివర్సిటీలు,
అఫిలియేషన్ సంస్కరణలు అన్న అంశంపై మాట్లాడారు.

సెస్ డైరెక్టర్ ప్రొ. ఈ. రేవతి ప్రాథమిక విద్యావిధానం, గిరిజనుల విద్యా అవసరాలు,
ఆవశ్యకతపై మాట్లాడారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్-ఛైర్మన్ ప్రొ. వి. వెంకట రమణ టెక్నికల్
ఎడ్యుకేషన్, తెలంగాణ అవకాశాలు అన్న అంశంపై చర్చించారు.
యూజీసి సభ్యులు ప్రొ. శివరాజ్ సైన్స్, పరిశోధనలు అన్న అంశంపై, నల్సార్
యూనివర్సిటి రిజిస్ట్రార్ ప్రొ. వి. బాలకిస్టారెడ్డి లీగల్ విద్య, న్యాయ అంశాలు,
న్యాయ విద్య అభివృద్ధి అన్న అంశంపై గవర్నర్ తో వెబినార్ లో చర్చించారు.

tags : tamil sai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info