A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
Share |
September 19 2020, 1:25 am

తెలంగాణలో కాంగ్రెస్ కు మరో దెబ్బ తగులుతుందా? ఆదిలాబాద్ మాజీ ఎమ్.పి, గత ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన రమేష్ రాధోడ్ పార్టీని వీడడానికి సిద్దం అవుతున్నారా? మీడియాలో వస్తున్న కదనం ప్రకారం రాదోడ్ గత ఐదు నెలలుగా పార్టీలో అంత యాక్టివ్ గా లేరు.పా్ర్టీ ఆయా కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. రమేష్ రాదోడ్ బహుశా బిజెపిలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.రాధోడ్ గతంలో టిడిపి ఎమ్మెల్యేగా, ఎమ్.పిగా వ్యవహరిచారు. ఆయన భార్య సుమన్ కూడా ఎమ్మెల్యేగా టిడిపిలో ఉన్నారు. కాని తెలంగాణలో పరిస్థితులు మారడంతో వారు టిఆర్ఎస్ లో చేరారు.కాని గత లోక్ సభ ఎన్నికలలో రమేష్ కు టిక్కెట్ రాకపోవడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు బిజెపిలో చేరాలని ఆయన భావిస్తున్నారని సమాచారం.

tags : ramesh rathod

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info