A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
Share |
September 19 2020, 2:32 am

ప్రపంచంలోని యువ జనాభాలో సగం మంది మానసికవేదన, ఆందోళనకు లోనవుతున్నారని ఒక అద్యయనం వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. అత్యవసర, తక్షణ చర్యలు తీసుకోకపోతే.. యువతపై మహమ్మారి దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమున్నదని ఐఎల్‌ఓ హెచ్చరించింది. 'యువకులు - కోవిడ్‌ 19 : ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం' పేరులో ఐఎల్‌ఓ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 'కోవిడ్‌-19 మహమ్మారి మన జీవితంలోని ప్రతి అంశాన్నీ దెబ్బతీసింది. యువకుల సామాజిక, ఆర్థిక సమైక్యతపై సవాలు విసురుతున్నది. ఇప్పుడు అత్యవసర చర్యలు తీసుకోకపోతే.. యువత తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నది. 38శాతం మంది యువకులు తమ భవిష్యత్‌ ఏమిటో అర్థంకాక, కెరీర్‌పై అనిశ్చితిలో ఉన్నారు. 112 దేశాల నుంచి 12,000 మందికి పైగా యువకులపై అధ్యయనం చేశారు. విద్య ఆగిపోయిన లేదా ఉపాధి దెబ్బతిన్న యువకుల్లో ఈ మానసిన వేదన, నిరాశ రెట్టింపుగా ఉన్నట్టు పేర్కొంది. 'విద్య, ఉపాధి, మానసిక స్థితిపై సంబంధాన్ని నొక్కి చెబుతున్నదని తెలిపింది. విద్యా సంవత్సరం ఆలస్యం, లేదా వైఫల్యమవుతుందని భావించిన వారిలో 22 శాతం మంది ఆందోళన లేదా డిప్రెషన్‌కు గురవుతున్నారు. నివేదిక ప్రకారం.. 38శాతం మంది యువకులు తమ భవిష్యత్‌ ఏమిటో అర్థంకాక, కెరీర్‌పై అనిశ్చితిలో ఉన్నారు. ప్రతీ ఆరుగురిలో ఒకరు (17శాతం) ఉపాధి కోల్పోయారనీ, ఇందులో ముఖ్యంగా 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు క్లరికల్‌, సేవలు, అమ్మకాలు, చేతిపనులు సంబంధింత పనుల్లో ఉన్నవారే. ఉద్యోగ యువతలో పని గంటలు సుమారు రోజుకు సగటున రెండు గంటలు పడిపోయాయనీ, ప్రతీ ఐదుగురిలో ఇద్దరికి (42 శాతం) ఆదాయం పడిపోయింది.

tags : youth, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info