A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
Share |
September 19 2020, 5:27 am

ఎపి ప్రబుత్వం జలదోపిడీ చేస్తోందని,దీనిని నివారించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్లక్ష్యం చూపుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు..‘ఏపీ జలదోపిడీని నివారించడంలో మరియు టెండర్లను అడ్డుకోవడంలో కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరుపై సందేహలు కలుగుతున్నాయి. ఆగస్టు 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఉన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఆగస్ట్ 19న ఖరారయిన తర్వాత సమావేశానికి అటెండ్ అవుతానన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కన్నా.. కేసీఆర్ కు కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమనే సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత సీఎంపై ఉంది. కానీ, ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. మీరు తెలంగాణ గడ్డపై ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక పోగా.. రాయలసీమను రతనాలసీమ చేస్తా అనే హామీని నెరవేర్చడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రాయలసీమను సస్యశ్యామలం చేసే విషయంలో మాకే అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోం’ అని వంశీచంద్ హెచ్చరించారు.

tags : vamsichand

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info