A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
Share |
September 19 2020, 5:41 am

బెలారస్ అద్యక్షుడు అలెగ్జాండర్ దెబ్బకి ఆయన ప్రత్యర్ధి, పార్లమెంటు ఎన్నికలలో ప్రతిపక్షం తరుపున పోటీచేసిన స్వెత్లానా పరారై పోయారు. ఆమె బెలరాస్ వదలి లిధునియా పారిపోయారని వార్తలు వచ్చాయి. అద్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఆమె నిరసన తెలపడం, ఆమె కు మద్దతుగా అనేక మంది ఆ నిరసనలలో పాల్గొనడం , పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం వంటివి జరిగాయి. అయితే సడన్ గా స్వెత్లానా లిధునియా పారిపోయారు. దీనికి కొందరు తనను వ్యతిరేకిస్తారని, కొందరు అసహ్యించుకుంటారని, కొందరు అర్దం చేసుకుంటారని అంటూ ఏ పరిస్థితిలో వెళ్లానో తెలుసుకోవాలని అన్నారు. ఆందోళనకారులు కూడా చట్టాన్ని గౌరవించి హింసను విడనాడాలని సూచించారు. స్వెత్లానా భర్తను జైలులో పెట్టడం, ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడం తదితర కారణాలతో స్వెత్లానా బెలారస్ విడిచి వెళ్లారని భావిస్తున్నారు.

tags : belarus

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info