A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
Share |
September 19 2020, 5:48 am

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్భంద కాండ కొనసాగించి ఉంటే కెసిఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేదా అని ప్రశ్నించారు.జనగామ వద్ద జ్యోతిరావుపూలె విగ్రహాన్ని ఎవరో పాడు చేశారని, కొత్త విగ్రహం ఏర్పాటుకై వెళుతంటే తమను అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమను మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయడంలేదని, అధికార పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళుతున్నారని, వారికి ఏ ఆంక్షలు లేవన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఏమైనా రాజ్యసభ మెంబర్‌ ఇస్తానని అన్నాడా.. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లపై వంటావార్పు, అనేక రకాల ఉద్యమాలు చేస్తే ఏనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆపలేదు.. గిట్ల చేస్తే కేసీఆర్‌ సీఎం అయ్యేటోడా అంటూ హన్మంతరావు ప్రశ్నించారు.

tags : vh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info