A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుది ఓర్వలేనితనం
Share |
September 19 2020, 5:55 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్వలేక పోతున్నారని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతి ఒక అభివృద్ధి కార్యక్రమంపైన కోర్టుకు వెళ్తున్నారని ఆయన అన్నారు.సొంత మామను వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చిన చంద్రబాబు సంపాదన కోసమే వ్యవస్థను నాశనం చేశాడని ఆయన ద్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేసి మరోసారి కుప్పం నుంచి పోటీ చేసి గెలవాలని నారాయణస్వామి సవాల్ విసిరారు.వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఒంటరి మహిళలకు ఆర్థికంగా సహాయం చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు.

tags : narayanaswamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info