A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
Share |
September 19 2020, 5:18 am

తెలంగాణ మున్సిపల్,ఐటి శాఖల మంత్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కెటిఆర్ పట్టాబిషేకానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. ప్రగతి భవనలో కెటిఆర్ ఆద్వర్యంలో మంత్రి మండలి సమావేశం అయి ఆహార శుద్ది పరిశ్రమలకు సంబంధించి చర్చించడం విశేషం.కెటిఆర్ ఆఫీస్ నుంచి మంత్రి మండలి భేటీ అని అందరు మంత్రులకు వెళ్లిందట.దాని ప్రకారం కెటిఆర్ నేతృత్వంలో మొదటిసారిగా ‘కౌన్సిల్​ ఆఫ్ మినిస్టర్స్ ’ మీటింగ్ జరిగింది. సీఎస్ తోపాటు అన్ని శాఖల ప్రిన్సిపల్​ సెక్రెటరీలు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, చీఫ్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొ న్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై కేటీఆర్​ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలసీలపై మంత్రులకు వివరించారు. ఆ తర్వాత మంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సీఎం కాకుండా మంత్రి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్​ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు నాటి హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్ సెక్రటేరియట్ లో మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదని వార్త తెలిసినప్పుడు నాటి ఆర్దిక మంత్రి రోశయ్య క్యాంపు ఆఫీసులో మంత్రులతో మీటింగ్ పెట్టారు. తొలి ప్రభుత్వంలో కేసీఆర్ చైనా, సింగపూర్, మలేషియా టూర్ వెళ్లినప్పుడు ఆయన వద్ద ఉన్న శాఖలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి అప్పగించారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలా ఒక మంత్రి ఆధ్వర్యంలో మంత్రులంతా సమావేశమైన సందర్భాలు లేవు. సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండగా.. కేటీఆర్ కేబినెట్ మంత్రులందరినీ సమావేశపరిచిన తీరు.. అన్ని రాజకీయ పక్షాలను, రాజ్యాంగ నిపుణులలో ఆసక్తి కలిగించిందని, ఆశ్చర్యం కలిగించిందని ఒక తెలుగు పత్రిక కదనాన్ని ఇచ్చింది.

tags : ktr,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info