A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
Share |
September 19 2020, 4:06 am

తెలంగాణలో ప్రవేశపెట్టనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్, లాజిస్టిక్‌ పాలసీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ద్వారా ఆహారశుద్ధి రంగంలో చిన్న యూనిట్లతోపాటు గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఆహార ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో జల విప్లవం ఫలితంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతోపాటు నీలి విప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) అభివృద్ధి చెందుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో క్రాప్‌ మ్యాపింగ్‌ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తితో పాటు గొర్రెలు, చేపల పెంపకం కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు.


భవిష్యత్తులో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రా

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info