A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
Share |
September 19 2020, 5:21 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎపి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించవద్దని ముఖ్యమంత్రి జగన్ అదికారులకు స్పష్టం చేశారని మీడియాలో కధనాలు వచ్చాయి.కొందరు అధికారులు నీటిపారుదల సమీక్షలో కెసిఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నప్పుడు జగన్ ఈ సమాదానం ఇచ్చారని సమాచారం. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకు చేపడుతున్నామని, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే సరైన సమాధానం చెబుదామని జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే అంగీకరించేది లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర విభజనకు ముందునుంచి ఇచ్చిన ఉత్తర్వులను సిద్ధం చేయాలని జగన్ సూచించారు. ఎపి వాదనను బలంగా వినిపించాలని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info