A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
Share |
September 19 2020, 5:23 am

అవుట్‌ సోర్సింగ్‌ వ్యవస్థపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.అవుట్ సోర్సింగ్ అమలు చేస్తూ, దీర్ఘకాలంపాటు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించకుండా జీహెచ్‌ఎంసీ మాయ, మోసపుటెత్తులకు పాల్పడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాలను గౌరవించాల్సిన ప్రభుత్వం, దాని అజమాయిషీలోని సంస్థలే వాటిని ఉల్లంఘిస్తున్నాయని ఆక్షేపించింది. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీ చేస్తోందని అభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీలో పదేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలంపాటు అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న 98మంది పారిశుధ్య కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించిందన్న వార్త వచ్చింది. అన్ని రాష్ట్రాలలో ఈ తరహా వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాం నుంచి ఏర్పడింది.

tags : high court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info