A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
Share |
September 19 2020, 4:21 am

ఇది మంచి వార్తే. దేశంలో కొత్తగా 3.3 లక్షల కోట్ల వ్యయంతో ఎక్స్ ప్రెస్ వే లను నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించిందన్న వార్త వచ్చింది. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ ప్రాజెక్టు ముందుకు వెళితే దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది.
ఈ మెగా ప్లాన్‌లో భాగంగా తొలుత ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కోసం తొలి ఎస్‌పీవీకి ఎన్‌హెచ్‌ఏఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. రూ 45,000 కోట్ల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం ఏర్పాటైన తొలి ఎస్‌పీవీలో ఎన్‌హెచ్‌ఏఐ రూ 5000 కోట్లు వెచ్చిస్తుండగా, మిగిలిన 40,000 కోట్లను రుణ మార్కెట్‌ నుంచి సమీకరించనున్నారు. భారత మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పెన్షన్‌ నిధుల సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు సైతం ఆసక్తికనబరుస్తున్నారని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు పేర్కొన్నాయి.

tags : express highway

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info