A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
Share |
September 19 2020, 3:51 am

విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరాగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చుపెడితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయన్నారు. నెలకు కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ పోతే ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని సీఎం తెలిపారు.
అక్టోబరు నాటికి అవుకు టన్నెల్‌-2 పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం అక్టోబరు నాటికి అదనంగా మరో 10వేల క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info