A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
Share |
September 19 2020, 4:17 am

త్వరలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐటి) పాలసీని విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు.ప్రస్తుతం విడుదల చేసింది పారిశ్రామిక విదానం అని ఆయన అన్నారు. ఐటి రంగానికి సంబందించి మరో విదానం ఇస్తామని ఆయన అన్నారు. కరోనావైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితులను అనువుగా మార్చుకుంటామని పేర్కొన్నారు. . గత ప్రభుత్వం చేసినట్టు పారిశ్రామికవేత్తలను మోసం చేయమని పేర్కొన్నారు. తాము పాలసీలో ఏం చెప్తే అది కచ్చితంగా చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. అందుకే తమ పెట్టుబడులు, ఉద్యోగాలపై అబద్ధపు ప్రకటనలు చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికను సిద్ధం చేశాని గౌతంరెడ్డి తెలిపారు.

tags : mekapati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info