A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
Share |
September 19 2020, 4:29 am

వెనుకబడిన వర్గాల నేత, రిటైర్డ్ జడ్డి ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మంత్రి శంకరనారాయణ విమర్శించారు. ఏబీఎన్ రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్‌ నడుస్తుందని, బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.బీసీలు హైకోర్టు జడ్జీలు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఓట్లు వేయలేదన్న అక్కసుతో బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బీసీలకు ప్రాధాన్యత లభిస్తోందని శంకర్‌ నారాయణ చెప్పారు.

tags : sankaranarayana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info