A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
Share |
September 19 2020, 4:41 am

నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ కె . రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లేఖ లోని ముఖ్యంశాలు ..రఘురామకృస్ణంరాజుకు నిజంగానే రాముడిమీద భక్తా?లేక బిజెపి మీద భక్తా అన్నది తెలియదు కాని, అయోద్య లో రామాలయం శంకుస్థాపన జరిగినప్పటి నుంచి రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.


రామ భక్తుల వసతి కోసం అయోధ్యలో ప్రత్యేక వసతి గృహాలు టీటీడీ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి .

అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి అయిన తరువాత శ్రీ రామచంద్రుడిని దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వేలామంది రామ భక్తులు అయోధ్య సందర్శిస్తారు వారి సౌకర్యం కోసం టీటీడీ 100 గదులతోవసతి గృహం నిర్మించాలి .

అయోధ్యలో వసతి గృహాలు , కల్యాణమండపం , శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాలు కోసం మూడు ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ను కోరుతూ వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి .

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించక పోయిన టీటీడీ భూమి కొనుగోలు చేసి అయినా వసతి గృహాలు , కల్యాణ మండపం , శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాలు చేపట్టాలి .

అయోధ్యలో టీటీడీ నిర్మించతలపెట్టిన వసతి గృహాలు భక్తుల భాగస్వామ్యం తో నిర్మించవచ్చు . దీనివల్ల టీటీడీకి ఆర్ధిక భారం పడదు .
అయోధ్యలో వసతి గృహం , కల్యాణ మండపం , శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరుతు ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడానికి కేబినెట్ మంత్రులతో , ఉన్నత అధికారులతో , టీటీడీ ప్రతినిధులతో ఒక్క కమిటీ ను ఏర్పాటు చెయ్యాలి .

హైదరాబాద్, చెన్నయ్ , టీటీడీ నిర్మించిన విధంగా అయోధ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, వసతి గృహాలు, కల్యాణమండపం నిర్మించాలి.

tags : raghuraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info