A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
Share |
September 19 2020, 1:59 am

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు అవకాశం ఉన్నప్పుడు గత టిడిపి ప్రభుత్వం ఎందుకు ముందుగానే విజయవాడ వచ్చిందో అందరికి తెలుసునని బిజెపి జాతీయప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ అన్నారు. అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నేతలు అద్దె ఇళ్లలో ఉండి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కేంద్రం జోక్యం చేసుకుందా అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఉండి ఎపిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి ఉండగా,గత ప్రభుత్వం ఎందుకు అందుకు బిన్నంగా వ్యవహరించిందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రాజదానిగా గత ప్రభుత్వం పెట్టుకున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుందా అని రామ్ మాదవ్ అన్నారు. అందువల్ల ఇప్పుడు మూడు రాజధానులని ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిపై కేంద్రం తమ పాత్ర లేదని హైకోర్టుకు తెలిపిందని ఆయన అన్నారు.అయినా దీని ఔచిత్యం గురించి ప్రశ్నించవచ్చని ,ఉత్తరప్రదేశ్ లో అంత పెద్ద రాష్ట్రం అయినా ఒకటే రాజదాని ఉందని ,అక్కడ పాలన సాగడం లేదా అని రామ్ మాదవ్ ప్రశ్నించారు.

tags : ram madhav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info