A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
Share |
September 19 2020, 4:15 am

ఆంద్రప్రదేశ్ హైకోర్టులో రాజధానికి సంబందించి వస్తున్న పిటిషన్ లు, జరుగతున్న విచారణ, లాయర్ల వాదోపవాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి.కోర్టులలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాని, తలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు చూస్తే మాత్రం కోర్టువారు రాజధాని అంశంలో అది అన్నారు..ఇది అన్నారు..అలా కోపంగా ఉన్నారు..ఇలా అసంతృఫ్తి వ్యక్తంచేశారు.అంటూ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా ప్రజాధనం వృదా అవుతుంటే చూస్తూ ఊరుకోం అని కోర్టువారు అన్నారని ప్రముఖంగా వార్తలు ప్రచురించారు.అది ఎంత ప్రాముఖ్యత అంటే, కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశంలో తమకు పాత్ర ఏమీ లేదని, గతంలో అమరావతిని రాజదాని అని అప్పటి ప్రభుత్వం ప్రకటించుకున్నా, ఇప్పటి ప్రభుత్వం మూడు రాజధానులు అని నోటిఫికేస్ ఇచ్చినా , కేంద్రం పాత్ర లేదని అఫిడవిట్ ఇచ్చినా కూడా ఆ వార్తకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజధాని అమరావతిలో ప్రజాదనం వృదా అవుతున్నదని హైకోర్టు వారు భాదపడినట్లు వార్తలు ఇచ్చారు.నిజమే. ఎక్కడ అలా ప్రజా ధనం వృదా అయినా న్యాయ వ్యవస్థ ఇలా స్పందించడం గొప్ప విషయమే. అలాగే ఉండాలి కూడా.దీనికి ప్రతిగా కొందరు సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థలో పెండింగులో ఉన్న కేసుల వల్ల, కొన్ని కేసులలో విచారణ జాప్యం వల్ల జరిగే ప్రజాధనం వృదావ్యయం మాట ఏమిటని ప్రశ్నిస్తూ పోస్టింగులు పెడుతున్నారు.కాని అది కరెక్టు కాకపోవచ్చు. కోర్టులలో కేసుల జాప్యానికి అనేక కారణాలు ఉండవచ్చు.అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే కోర్టు వారు ప్రజాధనం వధా కాకుండా అడ్డుకునే యత్నం చేస్తున్న విషయాన్ని. ఇది ఒక రకంగా సమాజం తరుపున వారు బాద్యత తీసుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి.అది మంచి పరిణామం. గతంలో చంద్రబాబు టైమ్ లో హైదరాబాద్ లో సచివాలయం భవనాల కోసం, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలు, అతిధి గృహాలకు వందలకోట్ల రూపాయలు వెచ్చించారు.కాని అంతలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయి, ఆ భవనాలను పాడు బెట్టి విజయవాడకు తరలివెళ్లిపోయారు.అప్పుడు కూడా ఇదే న్యాయ వ్యవస్థ స్పందించి ,ఎందుకు అలా వృదా చేవారని సుమోటోగా అయినా ప్రశ్నించి ఉంటే చాలా బాగుండేది. అప్పుడు అలా చేయలేదు కనుక,ఇప్పుడు ఇలా ప్రశ్నించరాదని లేదు. కచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని చెక్ చేయడం స్వాగతించాలి.రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని, దీనివల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడుతుందని చాలా మంది చెప్పారు.కాని చంద్రబాబు వినలేదు.శివరామకృస్ణ కమిటీ అన్ని ఆపీస్ లు ఓకే చోట పెట్టవద్దని చాలా స్పష్టమైన సిఫారస్ లు చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.పైగా వ్యాపార ప్రముఖులతో ఒక కమిటీని వేసి తన ఇష్టం వచ్చినట్లు చేసుకున్నారు.అప్పుడు న్యాయ వ్యవస్థకు ఎవరైనా వెళ్లి ఉంటే బాగుండేది. మరి ఎవరైనా కోర్టును ఆశ్రయించారో లేదో తెలియదు.కాని భూముల సమీకరణపై మాత్రం కోర్టులో కేసులు జరిగాయి. చంద్రబాబు మాటల్లోనే రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయి.మరి అంత డబ్బు ఒకే ప్రాంతంలో వెచ్చించడం సాద్యమేనా?అంతకాకపోయినా, లక్షా తొమ్మిదివేల కోట్ల వ్యయం అవసరం అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అలాగే ఎన్నికలకు ఆరు నెలల ముందు 49 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు.అందులో ఎంత వృదా వ్యయం ఉన్నది కూడా తేల్చితే మంచిదే. ఇప్పుడు హైకోర్టులో ఒకరు వేసిన పిటిషన్ లో 51 వేల కోట్లు వ్యయం చేసినట్లు చెప్పినప్పుడు కోర్టు అసలు ఎంత వ్యయం అయింది?ఇంతవరకు నిర్మించిన భవనాలను ఏమి చేస్తారు? తదితర అంశాలపై అక్కౌంటెంట్ జనరల్ నివేదిక ఇవ్వాలని కోరారు. అప్పుడు అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశించాలి.ఒక సంగతి ఏమిటంటే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కూడా ఏభై వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఎక్కడా చెప్పలేదు.పది వేల కోట్ల వరకు వ్యయం చేసినట్లు ఆయన పలుమార్లు అన్నారు. అంత ఖర్చు చేయలేదని, ఆరువేల కోట్ల లోపు మాత్రమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జవాబు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. మరి సడన్ గా హైకోర్టులో 51 వేల కోట్ల అంకె ఎలా వచ్చిందో తెలియదు.నిజంగానే అంత భారీ గా ఖర్చు చేసి ఉంటే రాజధాని నిర్మాణం దాదాపు పూర్తి అయి ఉండాలి కదా. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మిచవలసిన అవసరం ఏమి వచ్చింది?హైకోర్టు కూడా తాత్కాలిక భవనంలోనే ఎందుకు పెట్టవలసి వచ్చింది. ఆ భవనాలకు చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఎందుకు వ్యయం చేశారు. అక్కడ నిర్మించతలపెట్టిన భవనాలకు పునాదికే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది?కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 40 కోట్ల వ్యయం అవుతుందని గతంలో అంచనా వేశారట. దానిని వృదా వ్యయంగా చూడాలా? అవినీతిగా చూడాలా?పైగా అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించగలుగుతుందా? అక్కడ ఉన్న భూముల వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పదమూడు జిల్లాల ప్రజలంతా కట్టిన పన్నులను ఓకే చోట వెచ్చించాలని ఎవరైనా చెప్పగలరా? ఇరవై,ముప్పై ఏళ్లకు గాని ఇది ఒక నగరం అయ్యే అవకాశం ఉందని పలునివేదికలు చెబుతున్న తరుణంలో ఒకే చోట అంత మొత్తం ఖర్చు పెడితే మిగిలిన ప్రాంత ప్రజలు ఏమి కావాలి?నిజానికి గత ప్రభుత్వం తలపెట్టినట్లు ఒక్కొక్కటి ఏభై అంతస్తుల భవనాలు అవసరం ఉంటాయా? మొత్తం సచివాలయంలోకాని, ఇతరత్రా కాని రాజదానిలో ఉండే ఉద్యోగులు ఎందరు? నగరం అంటే నగరం అనే పిచ్చిలో పడి వేల కోట్లు వ్యయం చేస్తుంటే,అది ప్రజా ధనం వృదా కింద వస్తుందా?రాదా? అక్కౌంటెంట్ జనరల్ నివేదికలో హైకోర్టు వారికి ఈ విషయాలన్ని వివరిస్తారో లేదో తెలియదు.ఇదే సమయంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంతవరకు నిర్మించిన, లేదా ఒక దశలో ఉన్న భవనాలను వృదాగా పెడతామని ఎక్కడైనా చెప్పిందా? అయినా అవన్ని వృదాయేనని పిటిసనర్ లు ఎలా భావించారో తెలియదు.ఆ పాయింట్ మీద హైకోర్టు వారు స్పందించడం సమర్ధనీయమే అయినా, రాజధాని పేరుతో జరిగిన అనేక అవకతవకలపై కూడా దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది.రాజధాని లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇన్ సైడ్ ట్రేడింగ్, అనేక ఇతర భూమి కుంభకోణాలు ,సింగపూర్ కంపెనీలకు ఉత్తపుణ్యానికి బూమి కట్టబెట్టడమే కాకుండా వారికోసం 5 వేల కోట్లకుపైగా నిధులు వెచ్చించడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దమైతే, అదంతా వృదా వ్యయం కిందకు వస్తుందా?రాదా అన్నది కూడా ఆలోచించాలి.నిజమే హైకోర్టువారు చెప్పినట్లు అనేక స్కీములు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి కాకపోవడం వల్ల కోట్ల కొలది నిధులు అదనంగా వ్యయం అవుతున్నాయి.అలాంటి ప్రాజెక్టుల విషయంలో కూడా న్యాయ స్థానాలు గట్టిగా స్పందిస్తే దేశంలో ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి జాప్యం అవ్వకుండా ఉండేవేమో? ఇదే సందర్భంలో ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని కూడా గుర్తుచేసుకుంటే బాగానే ఉంటుంది.తెలంగాణలో సచివాలయ భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మించాలని సంకల్పించినప్పుడు పలువురు కోర్టుకు వళ్లారు .వందల కోట్ల రూపాయల అనవసర వ్యయం అవసరమా అని కొందరు ప్రశ్నించారు.తలంగాణ హైకోర్టు వారు విచారణ చేసి పది నెలల తర్వాత ప్రభుత్వ వైఖరిని సమర్దించారు. అలాగే కేంద్రంలో పార్లమెంటు భవనాన్ని కొత్తగా నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని తీసివేసి కొత్త భవనాన్నినిర్మించడానికి సిద్దమయ్యారు. ఇందుకు ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా సమయంలో ఈ డబ్బు వృదా ఖర్చు అని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయినా కేంద్రం దీనిపై ముందుకు వెళుతోంది.ఈ నేపధ్యంలో ఎపి రాజధాని వికంద్రీకరణ వ్యవహారం, అమరావతిలోనే మొత్తం లక్ష కోట్లు వ్యయం చయాలా?అలా అయితే మిగిలిన ప్రాంతాలలో ఏర్పడే అసంతృప్తి ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశం ఉండదా? ఇలాంటి ఎన్నో అంశాలకు కోర్టులు పరిష్కారం చూపడం కష్టమే. అయితే అదే సమయంలో ఎక్కడ ప్రజా ధనం వృదా అవుతున్నా కోర్టువారు పూనుకుని నివారించగలిగితే హర్షించాలి. రాజధాని అంటే భవనాలు మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉండాలి. ప్రజల మనోభావాలను గౌరవించేదిగా ఉండాలి.గతంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ను అమలు చేయడం, విశాఖ వంటి నగరాన్ని పూర్తిగా వినియోగించుకోవడం , తద్వారా ఉత్తరాంద్ర ప్రజలలో ఒక విశ్వాసం కల్పించడం వంటి అనేక అంశాలు కూడా మూడు రాజధానుల అంశంలో ముడిపడి ఉంటాయి. ఈ అంశాలన్ని గౌరవ హైకోర్టువారికి తెలియకుండా ఉండవు.అందువల్ల ఏది వృదా వ్యయం. ఏది కాదు?అన్నవాటిపై హైకోర్టువారు పరిశీలన చేసి తగు నిర్ణయాలు చేస్తారని భావించాలి.

tags : ap, highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info