A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
Share |
September 19 2020, 5:02 am

రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి
        శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ మహబుబ్ నగర్ పట్టణంలో
కరోనా మహమ్మారి తో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలలో
పాల్గోని పలువురి కి అదర్శంగా నిలిచారు.
 
ప్రతిరోజు ఎదో టీవిలోనూ, పత్రికలలో కరోనా తో చనిపోయిన వ్యక్తి
ని అసుపత్రిలోనే వదలివేళ్ళిన బందువులు, కుటుంబ సభ్యులు
లాంటి వార్తలు విని మంత్రి చలించిపోయారు. ఏలాగైనా ప్రజలలో
అవగాహన ను తీసుకోచ్చేందుకు మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్
గారు కరోనా తో చనిపోయిన వ్యక్తి అంతీమ సంస్కారాలలో కోవిడ్
నిబందనలను పాటిస్తూ PPE కిట్టు దరించి పాల్గోన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లదండ్రులు
దురుదృష్టవశాత్తు కరోనా బారిన పడి అకాల మృతి చేందితే వారి
పిల్లలు కనీసం మానవత్వం చూపకుండా మృతదేహం ను
తీసుకేళ్లకుండా అసుపత్రి లోనే వదలివేయటం మానవత్వం లేని
చర్య గా అభివర్ణించారు.

 హైదరాబాద్ లోని గాంధీ అసుపత్రి లో మరియు వరంగల్ లో
జరిగిన సంఘటన లపై వచ్చిన వార్తా కథనాలపై ప్రజలకు
కనువిప్పు కలిగించే విధంగా అవగాహన ను తీసుకోచ్చేందుకు
తన వంతు సామాజిక  భాధ్యతగా PPE కిట్టు దరించి కోవిడ్
ప్రోటోకాల్ ప్రకారం కరోనా తో చనిపోయిన వ్యక్తి దహన
సంస్కారాలలో పాల్గోన్నారు.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం అన్ని
త్యాగాలు చేస్తే వారి పిల్లలు అంతీమ దహన సంస్కారాలు
చేయకుండా , కనీసం అసుపత్రికి వేళ్ళి చూడకుండా ఉండటం
మానవ మృగాలు చేసే పనిగా మంత్రి హెచ్చరించారు. ఇప్పటికైనా
ప్రజలందరూ కరోనా తో చనిపోయిన వారి పట్ల మానవత్వం చూపి
PPE కిట్టు దరించి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం గా అంతీమ
సంస్కారాలు జరపాలని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్
పిలుపునిచ్చారు. PPE కిట్టు దరించి 5 నుంచి 10 మందిలోపు
అంతీమ సంస్కారాలలో పాల్గోనటం వల్ల ఎలాంటి ఇబ్బందులు
తలేత్తవని డాక్టర్లు సూచించారన్నారు.

tags : srinivas goud

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info