A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
Share |
September 19 2020, 4:10 am

అయినదానికి,కాని దానికి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఇబ్బంది ఇలాగే ఉంటుంది. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంపై చేసిన ట్వీట్ పై పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.విశాఖలో ఎల్ జి పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అర్జంట్ గా అక్కడకు వెళతానని ప్రదాని ఆపీస్ కు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు విజయవాడ కు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు.అంతేకాకుండా ఆయన తన ట్వీట్ లో ఎక్కడా స్వర్ణ పాలెస్ హోటల్ గురించి కాని, రమేష్ ఆస్పత్రి గురించి కాని, చివరికి డాక్టర్ రమేష్ గురించి కాని ఒక్క ముక్క రాయలేదని నెటిజన్లు ప్రశ్నించడమే కాకుండా, కొన్ని ఆంగ్లపత్రికలు సైతం ఈ విషయాన్ని ప్రముఖంగా ఇచ్చాయి. కేవలం అగ్ని ప్రమాదంలో చనిపోయినవారికి సానుభూతి తెలపడం మినహా ఇంకేమీ ప్రస్తావించలేదేమిటని ఒక ఆంగ్ల పత్రిక కధనాన్ని ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డాక్టర్ రమేష్ పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించడమే కారణమా? దానికి తోడు తనకు కులం ఆపాదిస్తారా అంటూ చంద్రబాబు బాధపడ్డ మరుసుటి రోజే ఈ ఘటన జరిగితే, ఆ ప్రమాదానికి కారకులు లేదా బాద్యులైన వారిపై గట్టి చర్య తీసుకోవాలని కోరకపోవడాన్ని ఏమంటారని ప్రశ్నిస్తూ పోస్టింగులు వస్తున్నాయి.మరి దీనికి చంద్రబాబు ఏమని జవాబిస్తారు!

చంద్రబాబు ట్వీట్ ఇలా ఉంది.

In deep anguish after learning about the fire accident at the Vijayawada Covid Centre this morning. I extend my deepest condolences to the families who have lost their loved ones and pray for the speedy recovery to those injured.

tags : chandrababu, caste

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info