A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చరిత్ర చెబుతున్న కెసిఆర్
Share |
September 19 2020, 5:28 am

మరో వెయ్యి టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు.ఆయన కేంద్రం, ఎపి వైఖరులను తప్పు పడుతూ అదికారిక సమావేశంలోమాట్లాడారు. ఆ ందర్భంగా గత చరిత్రను వివరించారు. కెసిఆర్ వాదనలో ఒక భాగం ఇలా ఉంది.
‘‘గతంలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని తెలంగాణ ప్రస్తావించింది. దాంతో, రెండింటినీ కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. వాస్తవాలను మరోసారి వివరిస్తాం’’ అని వెల్లడించారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ చెప్పిందని, దాని ప్రకారం, 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని చెప్పారు. ‘‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్‌ను 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రైబ్యునల్‌ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌ సాగర్‌ తదితర ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం’’ అని వివరించారు. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆర్డీఎస్‌ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చడంతో రాలేదని, ఆర్డీఎస్‌ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info