A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
Share |
September 19 2020, 5:29 am

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోన వైరస్ బారిన పడిన 442 మంది జర్నలిస్టులకు 80 లక్షల రూపాయల ఆర్థిక సహాయం
అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు

★ వీరిలో ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన 257మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, 51 లక్షల 40 వేల
రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల
రూపాయలను అందిచామని తెలిపారు.

★ సోమవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా తాజగా మరో 101
మందికి పాజిటివ్ వచ్చిందని, మరో ముగ్గురు జర్నలిస్టులు హోంక్వారంటైన్లో ఉండవలసిందిగా వైద్యాధికారులు
సూచించారని తెలిపారు. ఈ 101 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున 20 లక్షల 20 వేల రూపాయలు
,హోమ్ క్వారంటైన్లో ఉన్న ముగ్గురు జర్నలిస్టుల కు పదివేల రూపాయల చొప్పున ముప్పై వేల రూపాయలు ఆర్థిక
సహాయం ను జర్నలిస్టుల ఆన్లైన్ ఎకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు.దీంతో మొత్తంగా అందరికీ 80 లక్షల రూపాయల
ఆర్థిక సహాయం అందిచినట్లు తెలిపారు.

★ జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపాలని
తెలిపారు.మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ని
సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

★ కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా
అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

tags : allam narayana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info