A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
Share |
September 19 2020, 4:25 am

గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ నిర్వహించాలని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదికారులకు ఆదేశాలు ఇచ్చారు.గ్రామ,వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని, సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలని కూడా ఆయన చెప్పారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని అధికారులు వెల్లడించారు.

tags : ap, posts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info