A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
Share |
September 19 2020, 5:09 am

*రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు
తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి *

రైతుభీమా కోసం రూ.1173.54 కోట్లు
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రీమియం నిధులు విడుదల
- 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.1141 కోట్ల ప్రీమియం, రూ.32.54 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల
- ఆగస్టు 14 2020 నుండి ఆగస్టు 13 2021 వరకు ఈ భీమా వర్తింపు 
- ఎల్ఐసీకి చెల్లించేందుకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
- 18 నుండి 59 సవంత్సరాల వయసుగల 32.73 లక్షల మంది రైతులు భీమా పరిధిలోకి
- ఈ ఏడాదితో 59 ఏండ్లు నిండిన రైతులు అనర్హులవుతుండగా, 18 ఏండ్లు నిండిన, కొత్తగా నమోదు చేసుకున్న దాదాపు
రెండు లక్షల మంది రైతులు నూతనంగా రైతుభీమా పథకం పరిధిలోకి
- కరోనా క్లిష్ట పరిస్థితులలోనూ రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ
కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు
- 2018 ఆగస్టు 14న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుభీమా పథకం ప్రారంభించారు
- గత రెండేళ్లలో ఎల్ఐసీకి రైతుభీమా పథకం కోసం ప్రీమియం కింద రూ. 1775.95 కోట్లు చెల్లింపు

- గత రెండేళ్లలో ఇప్పటి వరకు 32,267 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా వర్తింపు .. ఎల్ఐసీ ద్వారా ఒక్కో రైతు
కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు చెల్లింపు
- ఈ నెల ఆగస్టు 13 వరకు గత ఏడాది చెల్లించిన ప్రీమియం వర్తిస్తుంది
- ఎల్ఐసీ వద్ద పరిశీలనలో ఉన్న 1800 మంది రైతుల భీమా క్లైములు .. దీనికింద చెల్లించాల్సిన నిధులు రూ.90 కోట్లు
- ప్రపంచంలో ఎక్కడా రైతుభీమా లాంటి పథకం లేదు
- ఎక్కడా మద్యవర్తి, పైరవీకారు లేకుండా కేసీఆర్ గారు రూపొందించిన అద్భుతమైన పథకం
- రైతు ఏ కారణం చేత చనిపోయినా అయిదారురోజలలో రైతు కుటుంబానికి చెందిన ఖాతాలో రూ.5 లక్షలు జమ
- అన్ని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూక్ష్మదృష్టికి
నిదర్శనం
- అంచలంచెలుగా వ్యవస్థలలో లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్న కేసీఆర్ గారు
- ఎవరు ఏం మాట్లాడినా రైతులు, పేదలు, సామాన్యులకు న్యాయం చేయడంపైనే నిరంతరం దృష్టి
- ఈ రోజు దేశంలో కష్టసమయంలోనూ సంతోషంగా ఉన్న తెలంగాణ ప్రజలు
- వ్యవసాయంతో భరోసా, ఉపాధికి అవకాశాలు, జీవితానికి ఒక ధీమా కల్పించబడ్డాయి
- సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో తలఎత్తుకుని ప్రస్థానం కొనసాగిస్తున్న తెలంగాణ
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

tags : niranjanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info