A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
Share |
September 22 2020, 12:03 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతిదానికి అడ్డుపడుతూ, డ్రామాలు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి మ‌రీ ప్రజలు ఆయ‌న‌ ఇంటిని చుట్ట‌ముడతార‌ని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి హెచ్చ‌రించారు. బాబుకు సిగ్గు, శరం ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చకు సిద్ధమా? అని స‌వాలు విసిరారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేద‌ని విమ‌ర్శించారు. ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేర‌ని పేర్కొన్నారు. కేవలం గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మాణం చేసిన ఆయ‌న‌కు మంచి చేయాలన్న ఆలోచ‌న ఎప్పుడూ రాద‌ని ఎద్దేవా చేశారు. ఇది "రాజన్న రాజ్యం - రైతు రాజ్యం" అని, ఏ రైతు కంట కన్నీరు రానివ్వమ‌‌ని భ‌రోసా ఇచ్చారు. అమరావతి రైతుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని శ్రీకాంత్‌రెడ్డి‌ మ‌రోసారి స్పష్టం చేశారు.

tags : gadikota

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info