A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
Share |
September 22 2020, 12:21 pm

స్కూళ్లు తెరిచే రోజు (సెప్టెంబరు 5)న విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌ పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, నోట్‌ బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌ క్లాత్‌.. అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. ఈ విషయంలో అధికారుల పనితీరును సీఎం ప్రశంసించారు. వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, అప్పటి వరకు ఈ పనులన్నీ పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి, ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. వాటన్నింటిపై అధికారులు మరింత ఫోకస్‌ పెట్టాలని నిర్దేశించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో పాటు, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

tags : education

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info