A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
Share |
September 22 2020, 12:28 pm

ఎపిలో స్కూళ్లలో పిల్లలకు తాగు నీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
అన్ని స్కూళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన తాగు నీరు అందించేలా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఆ బాధ్యతను కంపెనీలకు అప్పగించాలని నిర్దేశించారు. రెండు నెలల్లో వాటిని ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొనగా, సకాలంలో వాటి ఏర్పాటు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు.


ఆకర్షణీయంగా ఉండాలి
నాడు నేడు పనులన్నీ షెడ్యూల్‌ ప్రకారం కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందమైన వాల్‌ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని, విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలని ఆదేశించారు. ప్రతి క్లాస్‌ రూమ్‌లో అన్ని రంగుల టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు–నేడు కార్యక్రమంలో చేపడుతున్న పనులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని సమావేశంలో అధికారులు చెప్పారు. ఈ ఏడాది అడ్మిషన్లకు కూడా అంచనాలకు మించి స్పందన కనిపిస్తోందని వారు తెలిపారు.

హైజీన్‌ కిచెన్లు
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 9 రకాల మార్పులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశంగా కిచెన్‌ను చేర్చారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్‌కు సంబంధించిన ప్లాన్లను అధికారులు సమావేశంలో వివరించారు. వీలైనంత త్వరగా వాటిని ఖరారు చేసి, పూర్తి పరిశుభ్రం (హైజీన్‌)గా ఉండేలా నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.

tags : ap, mineral water plants

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info