A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
Share |
September 22 2020, 12:37 pm

ఎపిలో నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే ప్రక్రియ రెండో దశ కింద కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. మొదటి దశలో దాదాపు 15 వేల పాఠశాలలకు మహర్దశ పట్టగా.. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు. నాడు నేడు కార్యక్రమం పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ‌సమీక్ష నిర్వహించారు. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో మిగిలిన 31,073 స్కూళ్లు, విద్యా సంస్థల్లో దాదాపు రూ.7700 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందని సమావేశంతో అధికారులు వెల్లడించారు. రెండో దశలో 14,584 స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4732 కోట్లు వ్యయం కానుందని, ఈ నెలాఖరులోగా ఆయా స్కూళ్లు, విద్యా సంస్థలను గుర్తించి, వచ్చే ఏడాది జనవరి 14న పనులు ప్రారంభించి జూన్‌నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు తెలిపారు. అదే విధంగా మూడో దశలో 16,489 స్కూళ్లు, విద్యా సంస్థల్లో రూ.2969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి వాటన్నింటిని గుర్తించి, నవంబరు 14, 2021 నుంచి∙పనులు ప్రారంభించి మార్చి 31, 2022 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.


మనబడి – నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొలిదశలో పలు స్కూళ్లలో చేపట్టిన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు సమావేశంలో చూపారు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలోని కొలవెన్నులో 1938లో కట్టిన ఒక పాఠశాలను కూల్చేయాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించగా, నాడు–నేడులో పూర్తి రూపురేఖలు మార్చారు. దీనికి అందరి నుంచి ప్రశంసలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. స్కూలుకు సంబంధించి నాడు – నేడు పరిస్థితులను వివరించారు. దాంతో పాటు, వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం మండల పరిషత్‌ పాఠశాల, విశాఖ జిల్లా గిడిజాల జడ్పీహెచ్‌ఎస్‌ ఫోటోలను కూడా ప్రదర్శించారు. వీటితో పాటు మరికొన్ని పాఠశాల్లో నాడు నేడు కింద చేసిన మార్పులను కూడా అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

tags : ap, schools

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info