A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
Share |
September 22 2020, 12:50 pm

పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని ,అది సరిగా లేనందువల్లే విశాఖ గ్యాస్‌ దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అబిప్రాయపడ్డారు. అక్కడ ప్రమాద నిరోద ఏర్పాటు సరిగా లేదని,అది ఉన్నట్లయితే ఆ ప్రమాదం జరిగేది కాదని జగన్‌ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని ఆయన చెప్పారు. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు‌. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా పారిశ్రామిక విధానంలో నిబంధనలు పొందుపర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

tags : vizag, gas

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info