A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
Share |
September 22 2020, 12:59 pm

పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. ఆయన పారిశ్రామిక భద్రత అంశంపై సమీక్షించారు. ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదాని గురించి ఇ-అట్లాసులో వివరాలు పొందుపర్చాలని ఆయన సూచించారు. పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా తెలిపారు.. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలని తెలిపారు. వీటిపై థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా ఉండాలని ఆదేశించారు. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది చూడాలన్నారు.

tags : jagan, industries

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info