A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
Share |
September 19 2020, 1:42 am

అయోధ్యలో అపూర్వమైన రామాలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. అయోద్య సమస్యను సుప్రింకోర్టు పరిష్కారం చేసిన తర్వాత ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ లక్నో చేరుకున్న తర్వాత ముందుగా హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత రామాలయ ప్రాంగణానికి వచ్చి పారిజాత మొక్కను నాటారు. తదుపరి ఆయన అత్యంత శాస్త్రోక్తంగా జరిగిన బూమి పూజలో ఆయన నిర్వహించారు. యుపి గవరనర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్, ఆర్ఎస్ఎస్ అదినేత మోహన్ భగవత్ తదితరలుఉ పాల్గొన్నారు.ఎన్నో దశాబ్దాలుగా ఉన్న రామజన్మభూమి వివాదం పరిష్కారం అవడం, మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఒక ప్రత్యేకతగా భావించాలి. కరోనా సమస్య లేకపోతే లక్షలాది మంది సమక్షంలో ఈ భూమి పూజ జరిగి ఉండేది. అయినా ప్రదాని చేతుల మీదుగా తక్కువ మంది మద్యలో అయినా గొప్పగా సాగిందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ చానళ్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాలు రావడమే కాకుండా, అనేక మంది అద్యాత్మికవేత్తలతో రామాలయ విశిష్టతపై ప్రసంగాలు సాగాయి. రాముడి గొప్పదనాన్ని వర్ణిస్తూ వారు ఉపస్యసించారు.

tags : ayodhya rama temple

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info