A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
Share |
September 19 2020, 12:44 am

గతంలో అయోద్య రామాలయ వ్యవహారంలో ఎన్నడైనా కార్యక్రమాలు, ఆదోళనలలో పాల్గొన్నారో లేదో కాని, ఎమ్.పి అయిన తర్వాత బారతీయ జనతా పార్టీ వారి దృస్టిని ఆకర్షించడానికి నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు నానా తంటాలు పడుతున్నారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా
ఢిల్లీలో టీటీడీ ఆద్వర్యంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు కొనసాగాలని శాస్తోత్రంగా శ్రీ కె . రఘురామకృష్ణంరాజు పూజలు చేశారని తెలిపింది..
ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలయ పూజారులను ఆయన ఘనంగా సత్కరించారు .జై శ్రీరామ్... జైజై శ్రీరామ్ నినాదాలను చేసారు. అయోధ్యలోరామాలయం నిర్మాణానికి జరిగే కరసేవతో సహా అన్ని కార్యక్రమాలలో తాను పాల్గొంటానని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేస్తున్న భూమి పూజ భారత దేశ చరిత్రలో ఒక మైలు రాయి, దేశచరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా ఆయన ఎపి ప్రబుత్వంపై ఈ సందర్భంలో కూడా బురదచల్లే ప్రయత్నం చేశారు.
రామాలయం నిర్మాణానికి అయోధ్య జరిగే భూమి పూజ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ లేఖ రాసిన పూజ కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించక పోవడం చాల బాధాకరం అని ఆయన అన్నారు.

తెలంగాణలో కాని,మరే రాష్ట్రంలో కాని అలా గుడులలో ప్రత్యేక పూజలు ప్రభుత్వపరంగా జరిగాయా? వైసిపి టిక్కెట్ పై ఎన్నికై, అసమ్మతి ఎమ్.పిగా మారి ,ఇలా బురద చల్లితే శ్రీరాముడు ఒప్పుకుంటారా?

tags : raghuramakrishnamraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info