A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
Share |
September 19 2020, 5:09 am

పాకిస్తాన్ మళ్లీ భారత్ ను కవ్విస్తున్నట్లుగా ఉంది. దుర్మార్గంగా భారత్ అదీనంలో ఉన్న కశ్మీర్ ను తన ప్రాంతంగా చూపుతూ మాప్ లను తయారు చేసింది.జమ్ము-కశ్మీర్ లో ఆర్టికిల్ 370 రద్దు చేసి ఏడాది అవుతున్న తరుణంలో పాకిస్తాన్ ఈ రకంగా మాప్ ను తయారు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.అంతేకాకుండా, గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్‌ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చగా, పాక్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్‌ఎసీ)ని కారాకోరం పాస్‌ దాకా పొడిగించింది. సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేసింది. పాక్‌ ప్రజలతోపాటు కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలకు సైతం ఈ మ్యాప్‌ ప్రతిరూపమని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. కొత్త మ్యాప్‌ అంటూ పాకిస్తాన్‌ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. మాప్ లో పెట్టుకుంటే వారి బూబాగాలు అయిపోతాయా? పాక్ ప్రజలను మభ్య పెట్డానికి కాకపోతే!

tags : pakistan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info