A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
Share |
September 22 2020, 1:05 pm

ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని.. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువయిపోయిందని తెలంగాణ శాసనసభ లో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దళితులపై సిరిసిల్ల దగ్గర మొదలుకొని గజ్వేల్‌ నుంచి రాజాపూర్‌ వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన రావడం లేదని ఆయన విమర్శించారు. ఈ దాడుల గురించి గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వైరస్‌ కారణంగా గవర్నర్‌ను నేరుగా కలవకుండా మెయిల్‌ ద్వారా ఫిర్యాదును పంపుతున్నట్లు ఆయన చెప్పారు.

tags : bhatti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info