A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
Share |
September 19 2020, 12:46 am

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులొచ్చే అవకాశాలుంటాయని, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలొస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ ప్రజలకు సలహా ఇచ్చారు. అనారోగ్యంతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే ముందుగా చేర్చుకొని చికిత్స చేయాలి. తర్వాతే కరోనా పరీక్ష చేయించాలి. పీహెచ్‌సీ స్థాయిలో కూడా ఈ చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వల్ప ధరలవే. నిపుణుల కమిటీ ప్రకారం రూ.వెయ్యికి మించవు. ఇక వెంటిలేటర్ల గురించి ఆలోచించవద్దు. అంతవరకు పోయాడంటేనే మనిషి ప్రాణాపాయంలోకి వెళ్లారని అర్థం. 10 రోజుల పాటు ఒక రోగికి ఆక్సిజన్‌ పెడితే రూ. 2,500 మాత్రమే ఖర్చవుతుంది అని ఆయన అన్నారు.కరోనా లక్షణాలున్నవారు యాంటిజెన్‌ పరీక్షలు, లేనివారు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని ఈటల కోరారు. ‘ప్లాస్మా బ్యాంకు పెట్టమని సీఎం ఆదేశించారు. దాని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం అని ఆయన తెలిపారు.

tags : eetala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info