A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
Share |
September 19 2020, 1:49 am

స్థానిక ఎన్నికలలో అక్రమాలు నిలువరించడానికి ఎపి ప్రభుత్వం రెండోసారి విడుదల చేసిన ఆర్డినెన్స్ వల్ల ఇంతవరకు జరిగిన స్తానిక ఎన్నికల ప్రక్రియ రద్దు అయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం మీడియా ప్రచారం మొదలు పెట్టింది. గతంలో సుప్రింకోర్టు ఒకే అంశంపై రెండుసార్లు ఆర్డినెన్స్ లు చెల్లవని తీర్పు ఇచ్చిందని, అందువల్ల దీనికి కూడా అది వర్తిస్తుందని వారు చెబుతున్నారు.ఆర్డినెన్స్ చెల్లకపోతే, పాత ఆర్డినెన్స్ ఆదారంగా విడుదల చేసిన ఎన్నికల ప్రక్రియ కూడా చెల్లదని వారు కొత్త వాదన తెచ్చారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై ఏమి చేస్తారో అంటూ కధనాలు ఇచ్చాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతోపాటు.. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే ఐదేళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చునంటూ కొత్త నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది.

tags : ap,media, local elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info