A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
Share |
September 19 2020, 3:52 am

ఎపి చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రతిపక్ష కాంగ్రెస్,బిజెపిలు విమర్శలు కురిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.ఎపి ప్రభుత్వం కనుక పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో వైఫల్యం చెందినట్లు కేసీఆర్‌ అంగీకరించాలని, దానికి నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ఆయన ఈ అంశంపై లేఖ రాశారు.ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిలువరించని పక్షంలో కృష్ణానదిపై ఉన్న నాగర్జునసాగర్‌, కేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐఎస్‌, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, ఏఎమ్‌ఆర్‌పీ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఏడారిగా మారే ప్రమాదం ఉందని, అలాగే హైదరాబాద్‌కు తాగునీటిపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.. బుధవారం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని, అలాగే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203, 388 జీవోలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వెంటనే కేసు వేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

tags : uttamkumarreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info